Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ఆయన ఖాతాను శుక్రవారం గంటసేపు నిలిపివేసి ఆ తరువాత పునరుద్ధరించింది. 'ఫ్రెండ్స్.. ఈ రోజు ఓ విచిత్రం జరిగింది. అమెరికన్ డిజిటల్ మిలీనియం కాపీరైట్స్ యాక్ట్‌ను ఉలంఘించారంటూ ట్విట్టర్ గంటసేపు నా ఖాతాకు యాక్సిస్ ఇవ్వనిరాకరించింది. ఆ తరువాత పునరుద్ధరించింది. అని ఐటి మంత్రి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. తన ఖాతాకు యాక్సెస్ నిరాకరించదలిస్తే ముందుగా నోటీసు ఇవ్వాలనీ, ఈ నిబంధనను ట్విట్టర్ పూర్తిగా ఉల్లంఘించిందని ఐటీ మంత్రి అన్నారు. ట్విట్టర్ చర్య సమాచార సాంకేతిక (మధ్యవర్తి మార్గదర్శకాలు, డిజిటల్ మీడియా నైతిక నియమావళి) రూల్స్-2021 లోని 4(8) నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుందని అన్నారు. రవి శంకర్ ప్రసాద్ పోస్టులను డిఎంసిఎ యాక్ట్ కింద ఫ్లాగ్ చేశారా, లేక తొలగించారా అన్నది స్పష్టంగా తెలియరాలేదు. తాను న్యూస్ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్పింగ్స్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటాను. ఇది చాలా ప్రభావం చూపుతుంది. ట్విట్టర్ చర్య తనను హతాశుణ్ణి చేసింది. చాలా ఏళ్లుగా తాను న్యూస్ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల కిప్పింగ్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నానని, ఏ చానెల్ కానీ, యాంకర్ కానీ కాపీ రైట్స్ యాక్టును ఉల్లంఘించినట్లు తనపై ఇంతవరకు ఫిర్యాదు చేయలేదని ఐటి మంత్రి అన్నారు. ఏ ప్లాట్పామ్ అయినా సరే నూతన ఐటి నిబంధనలకు కట్టుబడాల్సిందేనని, దీనిపై రాజీ పడే ప్రసక్తే లేదని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు..సోషల్ మీడియా గొంతు నొక్కేందుకు మోడీ ప్రభుత్వం ఇటీవల ఐటీి రూల్స్-2021 చట్టానికి కొన్ని సవరణలు తీసుకొచ్చింది. ట్విట్టర్లో ఓ యాక్సెస్‌కు అనుమతించిన ఓ వీడియో దేశంలో మత విద్వేషాలకు ఆజ్యం పోసేదిగా ఉందంటూ ఆ సోషల్ మీడియా సంస్థపై మోడీ ప్రభుత్వం కేసు పెట్టింది. రెండు రోజుల క్రితమే సుప్రీం కోర్టు ఆ కేసు నుంచి ట్విట్టర్ ఎండీకి ఊరట కల్పించింది. మోడీ ప్రభుత్వం ఐటీి చట్టానికి తెచ్చిన సవరణలు భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయంటూ వాటిని అంగీకరిస్తూ డిక్లరేషన్ ఇవ్వకుండా ట్విట్టర్ జాప్యం చేస్తోందని ఐటీి శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఘటన చోటుచేసుకుంది.