Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీ ప్రభుత్వంపై ఎన్జీటీ ఆగ్రహం!
న్యూఢిల్లీ : ఏపీ ప్రభుత్వంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా నడుచుకుంటే.. ఏపీ సీఎస్‌ను జైలుకు పంపుతామంటూ హెచ్చరించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతులు లేకుండా అక్కడ పనులు చేపట్టవద్దని గతంలో ఎన్జిటి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పనులు చేపడుతున్నారంటూ తెలంగాణకు చెందిన వ్యక్తి గవినోళ్ల శ్రీనివాస్ ఎన్‌జిటిలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన ఎన్జిటి చెన్నై ధర్మాసనం.. ఎపి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను జులై 12కి వాయిదా వేసింది.