Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : రాష్ట్రంలో కోవిడ్ సంక్షోభంతో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులకు డ్రై రేషన్ కిట్ అందించే పథకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శుక్రవారం ప్రారంభించారు. నిర్మాణ రంగ కార్మికులకు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. రేషన్ కిట్‌లో 15 కేజీల బియ్యం, కేజి కందిపప్పు, కేజి వంట నూనె ఉన్నాయి. తమిళనాడు నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డులో రెండు లక్షలకు పైగా కార్మికులు నమోదైవున్నారని, వీరందరికి తొలి డోస్ టీకా ఇస్తామని అధికారులు తెలిపారు.