Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోచి షిప్‌యార్డ్ సందర్శించిన రాజ్‌నాథ్ సింగ్
కోచి : దేశీయ విమాన వాహక నౌక (ఐఏసీ) 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకోవడం మన దేశానికి గర్వకారణమని, ఆత్మనిర్భర్ భారత్‌కు మంచి ఉదాహరణ అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. రూపకల్పన నుంచి నిర్మాణంలో వాడిన ఉక్కు వరకు, కీలకమైన ఆయుధాలు, సెన్సార్లు అన్నీ ఇక్కడవేనన్నారు. కోచి షిప్‌యార్డ్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌకను శుక్రవారం సందర్శించి, సమీక్షించిన అనంతరం మంత్రి పై వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది దీన్ని ప్రారంభించనున్నారు. భారతదేశ 75 ఏండ్ల స్వాతంత్య్రానికి ఇది తగిన నివాళి అని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ నౌక పోరాట సామర్ధ్యం, దీనికున్న వివిధ విశిష్టతలు అన్నీ కలిసి దేశ రక్షణ రంగానికి పటిష్టమైన సామర్ధ్యాలను చేకూరుస్తాయని అన్నారు. సముద్ర రంగంలో దేశ ప్రయోజనాలను కాపాడడంలో సాయపడుతుందన్నారు. సీ బర్డ్ ప్రాజెక్టును సమీక్షించేందుకు గురువారం మంత్రి కర్వార్ను సందర్శించారు. భవిష్యత్తుల్లో భారత నావికాదళంలో ఇది అతిపెద్ద నౌకా స్థావరం కానుందన్నారు. 44 యుద్ధ నౌకల్లో 42 నౌకలు భారత షిప్యార్డ్ల్లోనే తయారవుతున్నాయని చెప్పారు. కోవిడ్‌పై పోరులో నేవీ గణనీయమైన కృషి చేసిందని మంత్రి చెప్పారు.