Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతిక్షణం మోసం..
- అబద్ధం.. దాటవేత
- మోడీ సర్కార్ తీరిది..
- గందరగోళంలో దేశప్రజలు..
- ఇది భవిష్యత్‌కు అనర్థం : విశ్లేషకులు
సెకండ్‌వేవ్ ధాటికి మరణమృదంగం మోగితే లైట్ తీసుకున్నది. ఇపుడు టీకా ఉత్సవ్ అంటూ మోడీ సర్కార్ తెగప్రచారం చేసుకుంటున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిక్షణం దేశప్రజలను మోసగిస్తున్నది. అవసరాన్ని బట్టి అబద్ధం.. కేంద్రం చేసే తప్పులు..లొసుగులను కప్పిపుచ్చేందుకు దాటవేత ధోరణి అవలంబిస్తున్నది. ఏడేండ్లు అధి కారంలో ఉన్నా..కరోనా తర్వాత మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరిది.
న్యూఢిల్లీ: కరోనా కోరల్లో చిక్కి దేశప్రజలు దిక్కుతోచనిస్థితిలో ఉంటే..వారి గురించి ఆలోచిద్దామని మోడీ సర్కార్‌లో ఏకోశాన కనిపించటంలేదు. పైగా నిత్యం కపట నాటకంలో పాత్రధారుల్లా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పోషిస్తున్నది.
డెల్టా ప్లస్ వేరియంట్ భయం
రెండుసార్లు కరోనా ప్రళయదాడి తర్వాత దేశప్రజలు కోలుకోలేనిస్థితిలో ఉన్నారు. ఓవైపు తమవారిని కోల్పోయి.. ఆర్థికంగా చితికిన కుటుంబాలు ఎన్నో. ఇప్పటికే దేశవ్యాప్తంగా 50కి పైగా డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు వచ్చాయని కేంద్రమే ప్రకటిస్తున్నది. కానీ ఇంత వరకూ ఆ వైరస్‌ను ఏవిధంగా కట్టడి చేయాలన్నదానిపై మాత్రం బీజేపీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కి స్తున్నది. మహామ్మారిగా మారనున్న థర్డ్‌వేవ్ గురించి భయపడుతున్న దేశప్రజలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వటానికి మోడీ ప్రభుత్వం నిరాకరిస్తున్నది.అన్నింటికంటే మించి జాతీయ విపత్తు నిర్వహణ చట్టం నిబంధనల నుంచి ఉపసంహరిం చుకోవడం వల్ల ప్రజలు చాలా నష్టపోయారు. ఈ అంటువ్యాధి తీవ్రంగా మారి... (గుజరాత్ నుంచి మధ్యప్రదేశ్ వరకు 50 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.) దేశంలో ప్రతిరోజూ నమోదైన మరణాల కంటే.. వాస్తవ మృతులను దాచిపెట్టినట్టు నివేదికలు ధ్రువీకరిస్తున్నాయి.మరోవైపు అధికారికంగా చనిపోయినవారి సంఖ్య నాలుగులక్షలకు చేరువైంది.
విస్టా నిర్మాణానికి 20వేల కోట్లు
ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకాల్చుకోవటానికి నిప్పు అడిగాడన్న సామెత బీజేపీ తీరు కనిపిస్తున్నది. రాజధాని ఢిల్లీకి చిహ్నంగా ఉన్న బలమైన భవనాలను కూల్చి
మోడీ-మహల్ సహా సెంట్రల్ విస్టా నిర్మించడానికి రూ. 20 వేల కోట్లు పెట్టడానికి రెడీ అయిపోయింది.2019 లో కార్పొరేట్ కంపెనీలకు సుమారు రూ.రెండు లక్షల కోట్ల మేర రుణాలను మాఫీ చేసింది.
13 ఏండ్లలో ఎన్నడూలేనంతగా మోడీ జమానాలోనే స్విస్‌బ్యాంకులో భారతీయ కార్పొరేట్ల సంపద పెరిగిపోయింది. కరోనా కాలంలో అంబానీ,అదానీల ఆస్తులు రెట్టింపవుతున్నాయి. కానీ పేదల బతుకులు మాత్రం ఇరుసులేని చట్రంలా మారిపోతున్నది.
దుర్భరంగా మారిన వారిని ఆదుకోవటానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చేతులురావటంలేదు. ఎన్నికలు వచ్చినపుడు మాత్రం..అదిగో..ఇదిగో అనటం..ఓట్లు,సీట్లు వచ్చాక దేశప్రజల్ని గాలికొదిలేయటం సర్వసాధారణమైందని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.
రోడ్డునపడ్డ బతుకులు
లక్షలాది కుటుంబాలు తినడానికి తిండిలేక.. ప్రాణాలను కాపాడుకోవటానికి పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. కేవలం ఒక ఏడాదిలోనే దేశంలోని పదివేల మంది పిల్లలు, బాలికలు, అనాథలు, నిరాశ్రయులయ్యారు. , దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్న బతుకులు రోడ్డునపడ్డాయి. నగదు సాయంగా రూ.7500,ప్రజాపంపిణీ వ్యవస్థద్వారా నిత్యావసరాలు అందజేయాలని సీపీఐ(ఎం) సహ ప్రతిపక్షాలు,ప్రజాసంఘాలు మోడీ సర్కార్‌కు సూచించాయి. స్విస్‌బ్యాంక్ నుంచి నల్లధనం తెచ్చి ఇస్తామన్నా..ఇంతవరకూ అతిగతీలేదు. కనీసం కరోనా కాలంలోనైనా నగదుబదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఖజానాలో డబ్బుల్లేవని ప్రతి మరణానికి నాలుగైదు లక్షల పరిహారం ఇవ్వలేమని మోడీ ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు చెప్పేసింది. కానీ కార్పొరేట్లు ఎగ్గొట్టిన 2.79లక్షల కోట్లను రద్దుచేయటానికి అంగీకరించింది. దీన్ని బట్టి చూస్తుంటే మోడీకి పేదలకన్నా పెద్దలే ముఖ్యమని స్పష్టమవుతున్నది.
వాహ్ మోడీ జీవా..అంటూ హౌర్టింగ్లు..
వ్యాక్సిన్ డ్రైవ్ వచ్చాక ఎటు చూసినా 'వాహ్ మోడీ జీ వా'' హౌర్టింగులే కనిపిస్తున్నాయి. అంతకుముందుటీకాల బాధ్యత మీదేనంటూ రాష్ట్రాలపై నెట్టివేయాలనుకున్నది మోడీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడి.. టీకాల కోసం బడ్జెట్లో కేటాయించిన రూ .35 వేల కోట్లు ఎక్కడ అని సుప్రీంకోర్టు లెక్కలడిగేసరికి బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎలాగో యూపీ ఎన్నికలు వచ్చేసరికి టీవీలో చూసినా..హౌర్టింగులు.. మీడియాలో ప్రకటనల్లో మోడీ కనిపిస్తున్నారు. అయోధ్య, వ్యాక్సిన్, పుల్వామా, ఇలా సందర్భాన్ని బట్టి రాజకీయం చేయటం బీజేపీ అలవాటుగా మారిందనీ, అయితే దీన్ని దేశప్రజలు అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.