Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెకండ్‌వేవ్‌తో దుర్భర పరిస్థితులు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్పందన కరువు : స్వాన్ నివేదిక
న్యూఢిల్లీ : దేశంలో వలసకార్మికులపై కరోనా ప్రభావం కొన సాగుతున్నది. గతేడాది ఫస్ట్‌వేవ్ నుంచి ప్రస్తుత సెకండ్‌వేవ్ సమ యంలోనూ వారు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటు కేంద్రం, అత్యధిక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారి కష్టాల విష యంలో తగిన విధంగా స్పందించడం లేదు. వారి కోసం ఎలాంటి ఉపశమన చర్యలు కూడా తీసుకోలేదు. ఫలితంగా వలసకార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్ట్రాండెడ్ వర్కర్స్ యాక్షన్ నెట్వర్క్ (స్వాన్) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ నివేదిక వెల్లడించిన విషయాల ప్రకారం.. దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ప్రారంభమయ్యే సమయానికే వలసకార్మికులు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. పనులు లేక ఖాళీగా ఉన్నారు. సామాజిక భద్రత కరువైంది. ఆరోగ్య సంరక్షణ అందు బాటులో లేదు. ఆకలితో అలమటిస్తున్నారు. అయితే, కరోనా తొలి దశ కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత కేంద్రం సెకండ్‌వేవ్ ప్రమా దాన్ని, తీవ్రతను గుర్తించడంలో అలసత్వం ప్రదర్శించింది. ఫలి తంగా సెకండ్‌వేవ్‌ను ఎదుర్కొనే కనీస సన్నాహాలు చేయకపోవడం అన్ని విభాగాల్లోనూ నష్టాన్ని కలిగించింది. ముఖ్యంగా, అసం ఘటిత రంగానికి చెందిన కార్మికులు తీవ్రంగా ప్రభావితమయ్యారు.
కరోనా సెకండ్‌వేవ్ కాలంలో వలస, అసంఘటిత కార్మికులు అనుభవించిన కష్టాలను అనేక కోణాల్లో స్వాన్ నివేదిక హైలైట్ చేసింది. వారు గతేడాదిలో అనుభవించిన బాధలతో సమానంగా ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని నివేదిక వివరించింది. దాదాపు 8వేల మంది కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో సంభాషణల ద్వారా ఈ నివేదికను పొందుపరిచారు. ఏప్రిల్, మే నెలల్లో 1396 వర్కర్ గ్రూపులు స్వాన్‌ను సంప్రదించాయి. వీరిలో60 శాతం మంది రోజువారీ కూలీ కార్మికులు కాగా, ఆరు శాతం మంది గ్రూప్ ఆధారిత రోజువారీ వేతనాల డ్రైవర్లు, గృహ సహాయకులు మొదలైనవారు. 16 శాతం మంది మాత్రం స్వయం ఉపాధి పొందుతున్నవారు ఉన్నారు.
స్వాన్‌తో మాట్లాడిన వారిలో 57శాతం మంది సగటు రోజువారీ కూలీ రూ. 308గా ఉన్నది. తినడానికి కనీసం రెండు రోజులకు సరిపడా రేషన్ కూడా లేకపోవడం వారి దయనీయస్థితికి అద్దంపడుతున్నది. పని పూర్తయినప్పటికీ తమకు కూలీలచెల్లింపులు జరగలేదని 34శాతం మందికి పైగా వలసకార్మికులు తెలిపారు. వారిలో 13 శాతం మందికి పాక్షిక వేతనం లభించడం గమనార్హం. ఇక ఆంక్షలు విధించిన తర్వాత తమ యజమాని నుంచి డబ్బు రాలేదనీ, పని ఆగిపోయిందని 92శాతం మంది వరకు వెల్లడించారు. 56 శాతం మంది కార్మి కులు తమకు ఒక నెలకు పైగా పని ఆగిపోయిందని నివేదించారు. '' పేదలు గత కొన్ని నెలలుగా ఒక రకమైన కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. జీవనోపాధి, ఆకలిసం క్షోభం, ఆరోగ్య సంక్షోభం వంటివి దేశాన్ని స్తంభింపజేశాయి. సెకండ్‌వేవ్ నిస్సందే హంగా అసమానమైనది'' అని నివేదిక పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల దాదాపు అన్ని బాధ్యతలను మళ్లించిందనీ, అనంతరం న్యాయవ్యవస్థ జోక్యం చేసు కోవాల్సి వచ్చిందని వివరించింది. భారతదేశ కార్మికులు, పౌరులకు నిర్దేశిత, సమా నమైన, గౌరవప్రదమైన ఆర్థిక పునరుద్ధరణ కేంద్రం గుర్తించడం చాలా అవసర మని నివేదిక పేర్కొన్నది. దాని రాజ్యాంగపరమైన బాధ్యతలను, ప్రపంచ ఉత్తమ పద్ధతులను అనుసరించి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.