Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈలపై ప్రభావం
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిపాదిత తాజా ఈ-కామర్స్ రూల్స్‌పై దేశంలోని కొన్ని రాష్ట్రాలు భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. వీటి ద్వారా ఉద్యోగాలు, ఎంఎస్ఎంఈలపై ప్రతికూల ప్రభావం పడుతుందని వెల్లడించాయి. ఈ రాష్ట్రాల జాబితాలో అధికం బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు ఉండటం గమనించాల్సిన అంశం. ఈ-కామర్స్ తాజా రూల్స్‌ను కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ ఇటీవల ప్రతిపాదించిన విషయం విదితమే. అయితే, ఈ నేపథ్యం లో సదరు రాష్ట్రాలు బలమైన భద్రతా చర్యలను సూచించడానికి యోచిస్తు న్నాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్రాల అధికారులు కొందరు వెల్లడించారు. అయితే, ఈ అంశం చాలా సున్నితమైనదనీ, దీనిని జాగ్రత్తగా పరిష్కరించాలని చెప్పారు. ఈ నిబంధనల కారణంగా తమ రాష్ట్రానికి చెందిన బిజినెస్ ఎకోసిస్టమ్‌కు ఆటం కం ఏర్పడుతుందనీ, ప్రత్యేకించి ఎంఎస్ఎంఈలు, చిన్న వ్యాపారాలతో పాటు విని యోగదారుల నిర్ణయాలు కూడా పరిమితమవుతాయని బీజేపీయేతర రాష్ట్రానికి చెందిన ఒక అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, మేజర్ ఈ-కామర్స్ సంస్థలైన అమెజాన్, వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ లతో పాటు కొన్ని పరిశ్రమల సంఘాలు కూడా ఈ అంశంపై తమ వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయి.