Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్ పై 25 పైసలు పెంపు
- పలు చోట్ల సెంచరీ కొట్టిన డీజిల్ !
న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఇంధన ధరలు వాహనదారుల నడ్డివిరుస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు రూ.100 దాటగా.. తాజాగా డీజిల్ సైతం సెంచరీ కొట్టింది. ఆదివారం మళ్లీ చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, లీటరు డీజిల్ పై 25 పైసలను పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.98.47కు చేరగా, డీజిల్ ధర లీటరకు రూ.88.91కి పెరిగింది. దేశ ఆర్థికరాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.104.56గా, డీజిల్ ధర రూ.93.46గా ఉంది. దేశంలో ఇంధన ధరలు అత్యధికంగా ఉండే రాజస్థాన్‌లోని గంగానగర్‌లో లీటరు పెట్రోఅలు రూ.109.30గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ.101.85కు పెరిగింది.ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన ధరల పెరుగు దల పరంపర ఇప్పటికీ కొనసాగుతుండటంతో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజీల్ ధరలు కొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. గత 55 రోజుల్లో చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరు కు రూ.8.07, డీజిల్‌పై రూ.8.38 పెంచాయి. మే 4 నుంచి ఆదివారం వరకు దాదాపు 31 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. దీంతో దేశంలోని చాలా నగరాల్లో పెట్రోల్ లీటరు ధర రూ.100 దాటగా.. డీజిల్ సెంచరీకి చేరువైంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.99.49, డీజిల్ ధర రూ.93.46, బెంగళూ రులో పెట్రోల్ ధర రూ.101.75, డీజిల్ రూ.94.25, కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.98.30, డీజిల్ ధర రూ.91.75గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుతూనే ఉన్నాయి. హైదరా బాద్‌లో పెట్రోల్ ధర రూ.102.32, డీజిల్ ధర రూ.96.90కు చేరింది.