Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇథనాల్ ప్రోగ్రామ్‌కు పేద వర్గాలకు ఉద్దేశించిన ఆహార ధాన్యాలు
- చమురు దిగుమతులు తగ్గించడానికి మోడీ ప్రభుత్వ విధానం
- తప్పుబడుతున్న సామాజిక కార్యకర్తలు
న్యూఢిల్లీ: భారతదేశ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ప్రోగ్రామ్‌కు జనాభాలో అత్యంత పేద వర్గాలకు ఉద్దేశించిన ఆహార ధాన్యాలను ప్రయివేటు పరిశ్రమలకు మళ్లించడం ద్వారా పేదలకు అయ్యే ఖర్చుతో మోడీ ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందా? మోడీ సర్కారు చర్యలు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి. దీని ప్రకారం.. పేదలకు ఉద్దేశించిన బియ్యాన్ని ప్రయివేటు యాజమాన్యంలోని ఇథనాల్ డిస్టలరీలకు సబ్సిడీ రేటుకు విక్రయిస్తారు. పరిశ్రమలకు చౌక రుణాలు అందుతాయి. అలాగే, తప్పనిసరైనటువంటి పర్యావరణ అనుమతుల నుంచి సైతం ఇవి మినహాయింపును పొందుతాయి. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్న వందలాది పారిశ్రామిక యూనిట్లను గుర్తించింది. వాటి ఇథనాల్ ఉత్పత్తి మౌలిక సదుపాయాలను పెంచడానికి ఆర్థిక సహాయం అందించడబడుతుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. మొత్తం ప్రక్రియ అనేది భారతదేశ చమురు దిగుమతి బిల్లును తగ్గించడం కోసం ఇథనాల్ ఉత్పత్తిని పెంచడం, చివరికి పెట్రోల్‌తో వాహన ఇంధనంగా వాడటం. ప్రభుత్వ యాజమాన్యంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) నుంచి 78వేల టన్నుల బియ్యం డిసెంబర్ 2020 నుంచి నవంబర్ 2021 వరకు ఇథనాల్ ఉత్పత్తి కోసం ప్రయివేటు పరిశ్రమలకు సబ్సిడీ రేటుతో కేటాయించినట్టు ఈనెల 15న కేంద్ర ఆహార కార్యదర్శి సుధాన్సు పాండే విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ''భారత ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ఆహార ధాన్యాలను తప్ప నిసరిగా ఉద్దేశించినది కాకుండా ఇతర ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని మరొక సూచన. ఈరోజు, మహమ్మారితో జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోకి రాని వారికి, అలాగే దాని కింద ఉన్నవారికి అధిక స్థాయిలో ఆహా ర ధాన్యాలు అవసరమవుతున్నాయి'' అని రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ నిఖిల్ డే న్యూస్‌క్లిక్‌తో అన్నారు. ''ఆహార ధాన్యాలను మొదట ప్రజా పంపిణీ వ్యవస్థను విశ్వ వ్యాప్తంగా చేయడానికి కేంద్రం ఉపయోగించాలి. తద్వారా దేశ ప్రజలందరికీ ఆహా రం లభిస్తుంది. ఇథనాల్ తయారీ వంటి ఇతర ప్రయోజనాల కోసం బహిరంగ మార్కెట్ నుంచి ఆహార ధాన్యాలు సేకరించడం అవసరం'' అని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే, చక్కెర తయారీ యూనిట్లు, డిస్టలరీలు తమ ప్రాజెక్టుల ను విస్తరిస్తే లేదా ఉపయోగించనట్టయితే తప్పనిసరైన పర్యావరణ అనుమతుల నుంచి మినహాయింపునిస్తూ ఈనెల 16న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఆహార ధాన్యాల వాడకం ద్వారా వారి ఇథనాల్ స్వేదనం సామర్థ్యాన్ని పెంచాలని కోరుతూ, వడ్డీ తగ్గింపు ద్వారా ఆర్థిక సహాయం కోసం వివిధ కేటగిరీలకు చెందిన 418 పారిశ్రామిక యూనిట్ల జాబితాను ఈనెల 30న కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఆమోదించింది. క్వింటాల్‌కు రూ. 2000 చొప్పున ఇథనాల్ ఉత్పత్తి చేయాలనుకునే ప్రయివేటు కంపెనీలకు ఎఫ్‌సీఐ నుంచి బియ్యం అందుబాటులో ఉంచాలని ఆహార మంత్రిత్వ శాఖ ఒక పాలసీని అదే రోజు నిర్ణయించడం గమనార్హం. అయితే, పేదలకు ఉద్దేశించిన ఆహారధాన్యాలను ఇటువైపు మళ్లించడం సరికాదని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు తినడానికి తిండి అందించే విషయాన్ని పక్కనబెట్టి, 'పెద్దల' ప్రయోజనాలకు కృషి చేస్తూ వారిపై మోడీ సర్కారు మరోసారి తన 'ప్రేమ'ను చాటుకున్నదని ఆరోపించారు.