Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ పదవీకాలాన్నీ ప్రభుత్వం మరొక ఏడాది పొడిగించింది. ఈ నిర్ణయంతో ఆయన 2022 జూన్ 30 వరకూ పదవీలో కొనసాగనున్నారు. కాగా, వేణుగోపాల్ పదవీ కాలాన్ని పొడిగించడం ఇదే రెండో సారి. అటార్నీ జనరల్‌గా జూలై 2017న నియమితులైన వేణుగోపాల్ 2020లో తొలిసారిగా పదవీ కాల పొడిగింపును పొందారు. ఇటీవల 12వ తరగతి పరీక్షల రద్దు కేసులో భారత ప్రభుత్వం తరుపున ప్రతినిధిగా వ్యవహరించారు. అలాగే ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ను రద్దు చేయడం, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా.. వంటి అనేక తీవ్ర సున్నిత కేసుల్లో ప్రభుత్వ వాదనలకు చుక్కానిగా వేణుగోపాల్ ఉన్నారు.