Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాల్పులు జరపడంతో వెనక్కు
- భారత సైన్యం ప్రకటన
శ్రీనగర్: జమ్ములోని ఒక సైనిక కేంద్రానికి పెద్ద ముప్పు తప్పిందనీ, ఆదివారం అర్ధరాత్రి సమయంలో కనిపించిన రెండు డ్రోన్లను తిప్పికొట్టామని భారత ఆర్మీ సోమవారం వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజామున జమ్ము ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌పై డ్రోన్ దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత మరో ప్రయత్నం జరిగిందని పేర్కొంది. జమ్ములోని కలుచక్ మిలటరీ స్టేషన్ సమీపంలో ఈ డ్రోన్లను గుర్తించామనీ, బలగాలు వెంటనే కాల్పులు జరపడంతో అవి వెనక్కు వెళ్లాయనీ, దీంతో పెనుముప్పు తప్పిందని సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం అర్ధరాత్రి 11.30, సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయాల్లో ఈ రెండు డ్రోన్లు కనిపించినట్టు తెలిపింది. '27-28వ తేదీల్లో అర్ధరాత్రి సమయంలో రెండు వేర్వేరు డ్రోన్లు రత్నుచుక్-కలుచక్ మిలిటరీ ప్రాంతంలో కనిపించడంతో దళాలు అప్రమత్తమయ్యాయి. ఆర్మీ సిబ్బంది కాల్పులు జరిపారు.'' అని పేర్కొంది.