Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్షద్వీప్ : నివాస స్థలాల్లో కొబ్బరి తాటి ఆకులు, కొబ్బరి చిప్పలు, వ్యర్థాలు ఉంటే వాటిపై ఫైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ పటేల్ నిర్ణయంపై లక్షద్వీప్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైన్లు విధించడం ఆపాలంటూ 'కొబ్బరి ఆకుల'తో వారు ధర్నాకు దిగారు. నిరసనలో భాగంగా సోమవారం ఉదయం 9 గంటల నుంచి ఒక గంట పాటు ఆందోళనకారులు కొబ్బరి ఆకులపై నిలుచున్నారు. వివాదాస్పద ఆదేశాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ విధంగా ఫైన్లు విధించడం ఆపాలంటూ 'సేవ్ లక్షద్వీప్ ఫోరం' (ఎస్ఎల్ఎఫ్) ఆధ్వర్యంలో ద్వీపవాసులు ప్లకార్డులు ప్రదర్శించారు. కొబ్బరి ఆకులు, వాటి వ్యర్థాలను ఆర్గానిక్ మెటిరియల్గా మలిచే టెక్నాలజీని ప్రవేశపెట్టాలని, తమపై ఫైన్ విధించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ అడ్మినిస్ట్రేర్ను వారు కోరారు. వ్యర్థపదార్థాల నిర్వహణ వ్యవస్థను అమలుపర్చనంతవరకు ఈ విషయంలో ఫైన్లను విధించే పూర్తి హక్కు యంత్రాంగానికి లేదని లక్షద్వీప్ ఎంపీ మొహమ్మద్ ఫైజల్ మీడియాకు తెలిపారు. అడ్మినిస్ట్రేటర్ తీసుకున్న పలు నిర్ణయాలు ఇప్పటికే లక్షద్వీప్‌లో అగ్గిరాజేసిన విషయం విదితమే.