Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరోనా ప్రభావంతో ఆర్థిక సంవత్సరం 2020-21 డిసెంబరు త్రైమాసికంలో కుటుంబాల పొదుపు జీడీపీలో 8.2 శాతానికి పడిపోయిందని ఆర్బీఐ ఇటీవల ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. 2019-20 ఇదే త్రైమాసికంలో పొదుపు స్థాయి 10.4 శాతంగా ఉంది. సంపూర్ణ లాక్డౌన్ అమలయిన 2020-21 జూన్ త్రైమాసికంలో కుటుంబాల పొదుపు పుంజుకున్నా, ఆ తర్వాత వరుసగా రెండు త్రైమాసికాల్లో తగ్గినట్లు వెల్లడించింది. జీడీపీలో బ్యాంకు డిపాజిట్ల నిష్పత్తి జులై- సెప్టెంబరులో 7.7 శాతం కాగా, అక్టోబరు-డిసెంబరులో 3 శాతానికి పడిపోయింది. జీడీపీలో రుణాల శాతం 2019 మార్చి నుంచి స్థిరంగా పెరుగుతున్నట్టు ఆర్బీఐ తెలిపింది. 2020 సెప్టెంబరుకు 37.1 శాతంగా ఉన్న రుణాల నిష్పత్తి.. 2020 డిసెంబరుకు 37.9 శాతానికి పెరిగింది. బ్యాంకులు, గహరుణ సంస్థల రుణాలు పెరిగినప్పటికీ.. కుటుంబాలకు ఇచ్చిన రుణాలు మాత్రం తగ్గాయి. డిపాజిట్లు, జీవిత బీమా ఫండ్లు, పింఛన్ నిధులు, కరెన్సీ, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, చిన్న మొత్తాల పొదుపు సహా ఆర్థిక ఆస్తులు 2020 డిసెంబరు చివరి వరకు రూ.6.93 లక్షల కోట్లకు తగ్గాయి. 2020 సెప్టెంబరులో ఇవి రూ.7.46 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం.