Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్ దిగుమతికి సిప్లాకు డీసీజీఐ అనుమతి
న్యూఢిల్లీ: భారత్‌లో త్వరలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అమెరికాకు చెందిన మోడెర్నా టీకాను దిగుమతి చేసుకునేందుకు మన దేశానికి చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా గ్లోబల్ పెట్టుకున్న దరఖాస్తుకు భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) మంగళవారం ఆమోదం తెలిపింది. ఒకవైపు అమెరికాకు చెందిన మరో వ్యాక్సిన్ ఫైజర్‌తో సంస్థతో చర్చలు కొనసాగుతుండగా, తాజా ఆమోదంతో భారత్‌లో అడుగుపెట్టనున్న అమెరికా వ్యాక్సిన్ మోడెర్నానే కానుంది. భారత్‌లో ఇప్పటికే దేశీయంగా సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవిషీల్డ్, భారత్ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు అత్యవసర వినియోగానికి సంబంధించి రష్యాకు చెందిన 'స్పుత్నిక్-వి' భారత్ అనుమతించినా, లాజిస్టికల్, ఇతర కారణాల వలన ఇంకా దీని కమర్షియల్ ఆవిష్కరణ జరగలేదు. స్పుత్నిక్-వి దిగుమతి, పంపిణీకి సంబంధించి డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఆ సంస్థతో ఒప్పందం చేసుకుంది. చివరి దశ క్లినికల్ ట్రయల్స్‌లో మోడెర్నా వ్యాక్సిన్ 94.14 శాతం సమర్థత చూపగా, దీని వినియోగానికి అమెరికా గతేడాది డిసెంబర్లో ఆమోదం తెలిపింది.