Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంక్ సేవలపై ఎస్బీఐ నిర్ణయం
ముంబయి : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తమ ఖాతాదారులకు అందించే పలు సేవలపై ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. జీరో బ్యాలెన్స్ ఖాతాగా ప్రసిద్ధి చెందిన బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) సహా ఇతర సాధారణ ఖాతాదారులకు అందించే పలు సేవల పరిమితి మించింతే అదనపు చార్జీలు వేయనున్నట్టు ప్రకటించింది. జులై ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ఆ బ్యాంక్ ప్రకటించింది. ఒక నెలలో బ్యాంక్ శాఖలు, ఏటీఎంల వద్ద కేవలం 4 సార్లు మాత్రమే ఉచిత లావాదేవీలు కల్పిస్తుంది. పరిమితి దాటిన తర్వాత చేసే నగదు ఉపసంహరణలు లేడా డిపాజిట్‌పై రూ.15తో పాటు అదనంగా జీఎస్టీ వసూలు చేస్తుంది. సొంత శాఖ లేదా ఎస్బీఐయేతర ఏటీఎం వద్ద ఉపసంహరణలకు చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఎస్బీఐ, ఎస్బీఐయేతర బీఎస్పీడీ ఖాతాదారుల ఆర్థికేతర లావాదేవీలపై చార్జీలు వసూలు చేయరు. ఈ ఖాతాదారులకు బ్రాంచ్‌లు, ప్రత్యామ్నాయ మార్గాల్లో చేసే లావాదేవీలు కూడా ఉచితమని ఎస్బీఐ స్పష్టం చేసింది. కాగా బీఎస్పీడీ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్ లీవ్స్‌ను ఉచితంగా అందిస్తుంది. అంతకు మించితే మాత్రం కొంత మొత్తం చార్జీ వసూలు చేస్తుంది. కొత్త చెక్‌బుక్ సర్వీస్ చార్జీల నుంచి సీనియర్ సిటిజన్లకు మినహాయింపునిచ్చింది.