Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సోలార్ పరిశ్రమలో అత్యంత సజనాత్మక కంపెనీలుగా గుర్తింపు పొందిన 1366 టెక్నాలజీస్, హంట్ పెర్వోస్కైట్ టెక్నాలజీస్‌లు తమ వ్యాపారాలను విలీనం చేసినట్లు ప్రకటించాయి. ఈ విలీనంలో భాగంగా రెండు వైవిధ్యమైన సాంకేతికతలు సైతం ఏకీకరణకు అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నాయి. తమ రెండూ విలీనం కావడం ద్వారా మార్కెట్లోకి అత్యంత శక్తివంతమైన టాండమ్ మాడ్యుల్స్‌ను తీసుకురావడంతో పాటుగా అత్యంత వేగంగా వద్ధి చెందుతున్న సోలార్ పరిశ్రమలో అగ్రగామిగానూ నిలువాలని నిర్దేశించుకున్నట్లు తెలిపాయి. విలీనమైన తరువాత కంపెనీని క్యుబిక్ పివిగా మార్చుకున్నట్లు వెల్లడించాయి. కొత్త కంపెనీకి పలు ఇన్వెస్టర్ల నుంచి 25 మిలియన్ డాలర్ల నిధులు కూడా అందుతున్నట్లు తెలిపాయి.