Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖ : వేతన ఒప్పందం చేయాలని, ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలని కోరుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల పిలుపు మేరకు మంగళవారం ఉక్కు కార్మికుల సమ్మె విజయవంతమైంది. ఈ సమ్మెలో ఐఎన్టియుసి మినహా 27 సంఘాలు పాల్గొన్నాయి. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన ఉదయం 5 గంటలకే కార్మికులు స్టీల్‌ప్లాంట్ వద్దకు చేరుకుని మెయిన్ గేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. 75 శాతం మంది కార్మికులు ఒక్క రోజు సమ్మెలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా గుర్తింపు యూనియన్ (సిఐటియు) అధ్యక్షులు అయోధ్యరామ్ మాట్లాడుతూ.. వేతన ఒప్పంద చర్చల్లో యాజమాన్యం కార్మికులకు ఉపయోగం లేని ప్రతిపాదనలు చేసిందన్నారు. కార్మికుల సహనం నశించి సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా కార్మికులకు ఆమోదయోగమైన వేతన ఒప్పందం చేయాలన్నారు.