Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపురలో రెచ్చిపోతున్న బీజేపీ కార్యకర్తలు
అగర్తలా: త్రిపురలో 'లా అండ్ ఆర్డర్' అదుపు తప్పిందనే దానికి ప్రస్తుతం అక్కడ చోటుచేసుకుం టున్న పరిస్థితులు నిదర్శనంగా నిలుస్తున్నాయి. త్రిపుర దక్షిణ జిల్లా బెలోనియా సబ్‌డివిజన్ పరిధిలోని రాజ్‌నగర్ ప్రాంతంలో సీపీఐ(ఎం) సీనియర్ నేత, ఎమ్మెల్యే సుధన్ దాస్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని నియంత్రించడంలో ఆ రాష్ట్ర సీఎం విప్లవ్ దేవ్ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ(ఎం) నాయకులు, మాజీ సీఎం మాణిక్ సర్కారు విమర్శలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘటన చేసుకున్నది. దేశంలో పెట్రోల్ ధరలు, నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఆదివారం నిరసన ర్యాలీని నిర్వహించింది. నిరసనల నేపథ్యంలో దాస్ సహా పలువురు కార్యకర్తలపై దాడి జరిగింది. ''పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసరాల ధరల పెరుగుదల నేపథ్యంలో ఐదు వామపక్ష పార్టీలు దేశవ్యాప్త నిర సన కార్యమ్రాలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే సీపీఐ(ఎం) బెలోనియా ఉప విభాగం కింద రాజ్‌నగర్‌లో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పూర్తియిన తర్వాత సీపీఐ (ఎం) నాయకులు, కార్మికులు, మద్దతుదారులు వీధి మూలలో గుమిగూ డారు. ఆ సమయంలోనే బీజేపీ కార్యకర్తలు ఇటుకలు, రాళ్లతో వారిపై దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సుధాన్ దాస్ తల, చేతులకు తీవ్ర గాయాల య్యాయి. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని'' సీపీఐ(ఎం) ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే, దాస్ నివాసంపై బీజేపీ కార్యకర్తలు రాళ్లురువ్వడం, పటాకులు విసరడంతో భార్య జయ బెనర్జీ ఛాతీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఉదయపూర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.