Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడిలో పాక్ హస్తం ఉంది: క్రాప్స్ కమాండర్ డిపి పాండే
న్యూఢిల్లీ : డ్రోన్లు రోడ్లు మీద తయారవ్వవని, పాకిస్తాన్ ప్రభుత్వ సహకారంతోనే డ్రోన్‌దాడి సాంకేతికత పరిజ్ఞానం ఉగ్రవాదులకు చేరిందని శ్రీనగర్‌లోని 15వ కోర్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ డిపి పాండే స్పష్టం చేశారు. ఆదివారం జమ్ములోని వైమానిక దళ కేంద్రంపై డ్రోన్ దాడుల నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ పాండే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దాడి ఘటనలో లష్కరే తొయిబా, జైషే మహమ్మద్ ప్రమేయం ఉండే అవకాశం ఉందన్నారు. పాక్ సైన్యానికి డ్రోన్లు, డ్రోన్ల టెక్నాలజీ, యుద్ధతంత్రంపై అవగాహన ఉందని, దాని సహాయంతోనే ఉగ్రవాదులకు ఈ సాంకేతికత చేరి ఉంటుందని ఆరోపించారు. భవిష్యత్తులో కూడా డ్రోన్ దాడులు కొనసాగవచ్చని అన్నారు. వీటిని ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు భారత సైనం తీసుకొంటుందన్నారు. ఈ కేసులో విషయాలు బయటకు తెలిస్తే దర్యాప్తునకు ఇబ్బందిగా మారుతుందని, ప్రాథమిక దర్యాప్తుతో పాక్ ప్రభుత్వం అండతోనే ఈ దాడి జరిగిందని అర్థమైందన్నారు. జమ్ముకాశ్మీర్ పోలీసులు కూడా ఈ దాడిలో లష్కరే పాత్ర ఉందని అనుమానిస్తున్నారని చెప్పారు.