Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అమెజాన్ పే లేటర్ క్రింద తమ వద్ద సైన్ అప్ చేసిన యూజర్ల సంఖ్య 20 లక్షలకు చేరుకుందని అమెజాన్ పే టుడే ఓ ప్రకటనలో తెలిపింది. కరోనా నేపథ్యంలో గతేడాది అత్యవసరాలు, అధిక విలువ కలిగిన వస్తు సామాగ్రి కొనుగోళ్ళను సుసాధ్యం చేసేందుకు దీన్ని ఆవిష్కరించింది. ఖాతాదారులు అప్పుడే కొనుక్కుని తదుపరి నెలలో చెల్లించగలిగేలా లేదా వాయిదాల్లోనూ చెల్లించేలా దీనిని రూపొందించింది. సులువైన డిజిటల్ సైన్-అప్ ప్రక్రియ ద్వారా వినియోగదారులకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్షణ రుణాన్ని ఆఫర్ చేసే చెల్లింపు పద్ధతి ఈ అమెజాన్ పే లేటర్. 99.9 శాతం పేమెంట్ సక్సెస్ రేట్‌తో కోటి పైగా లావాదేవీలను ఇది నమోదు చేసినట్టు పేర్కొంది.