Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గూగుల్ తన సోషల్ మీడియా వేదికల నుంచి 59,350 కంటెంట్ భాగాలను తొలగించింది. భారత్లోని వ్యక్తిగత వినియోగదారుల నుంచి వచ్చిన 27,700కు పైగా ఫిర్యాదులు కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ చివరి నుంచి ఈ భాగాలను తొలగించినట్టు గూగుల్ తన తొలి మంత్లీ ట్రాన్స్పరెన్సీ నివేదికలో వెల్లడించింది. నూతన ఐటీ నిబంధనలు అమల్లో భాగంగా గూగుల్ ఈ నివేదికను ప్రకటించింది. గూగుల్ అందుకున్న ఫిర్యాదుల్లో 96 శాతం కాపీరైట్ సమస్యలకు చెందినవే.