Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యను పరిష్కరిస్తామని మాటతప్పిన బీజేపీ ప్రభుత్వం
న్యూఢిల్లీ : భోపాల్ గ్యాస్ దుర్ఘటన కారణంగా వితంతులుగా మారిన వేలాది మంది మహిళలకు జీవనోపాధి పెన్షన్లు అందటం లేదు. గత 18 నెలలుగా తమకు వితంతు పెన్షన్ అందటం లేదని 5వేల మందికిపైగా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పెన్షన్లను ఆపేసిందని, తాము అధికారంలోకి వచ్చాక సమస్య పరిష్కరిస్తామని చెప్పిన బీజేపీ మాట నిలబెట్టుకోవటం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. గ్యాస్ దుర్ఘటనలో భర్తలను కోల్పోయిన మహిళలకు జీవనోపాధి పెన్షన్‌గా రూ.1000 అందజేయాలని 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే డిసెంబరు 2019 నుంచి పెన్షన్లు రావటం నిలిచిపోయాయి. రాష్ట్రంలో కమల్‌నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పెన్షన్లను ఆపేసిందని మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి. గత 18 నెలలుగా దీనిపై అనేక చోట్ల నిరసనలు చోటుచేసుకున్నాయి. ఈ పెన్షన్లను పునరుద్ధరిస్తామని, ఆగిపోయిన వాటిని చెల్లిస్తామని రాష్ట్ర బీజేపీ బాధిత మహిళలకు వాగ్దానం చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటుతోంది, అయినా వితంతు మహిళల సమస్య పరిష్కారం కాలేదు. దీనిపై రాష్ట్ర మంత్రి విశ్వాస్ సారాంగ్ను విలేకర్లు పలు సందర్భాల్లో ప్రశ్నించగా, సమాధానం దాటవేశారు. దాంతో 'భోపాల్ దుర్ఘటన వితంతుల' సమస్య పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.