Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరస్ ఉధృతికి డెల్టా వేరియెంటే కారణం : సీఎం పినరరు విజయన్
న్యూఢిల్లీ : కరోనా కేసుల సంఖ్య అనుకున్నంతగా తగ్గుముఖం పట్టలేదని కేరళలో మరో వారం రోజులు లాక్డౌన్ పొడగించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం పినరరు విజయన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. కరోనాకు సంబంధించి తమకు అధికారికంగా అందిన సమాచారం నేపథ్యంలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంపై సంతృప్తిగా లేమని విజయన్ అన్నారు. కోవిడ్ సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని ఆయన మీడియాకు తెలియజేశారు. స్వల్ప మార్పులతో మరోవారం లాక్డౌన్ అమలవుతుందని అన్నారు
'' ఇప్పటికీ రాష్ట్రంలో చాలాచోట్ల సగటు పాజిటివిటీ రేటు 10 శాతంపైన్నే ఉంది. ఇది 29.75శాతం నుంచి తగ్గినప్పటికీ..పాజిటివిటీ రేటు అంచనావేసినంతగా దిగిరాలేదు. లాక్డౌన్ అమలుజేయాలనే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేనప్పటికీ పాజిటివిటీ రేటును పరిగణలోకి తీసుకొని మరో వారం పొడగించాల్సి వచ్చింది'' అని విజయన్ చెప్పారు. రెండో వేవ్‌లో డెల్టా వేరియెంట్ పెద్ద ఎత్తున ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. ఈ వేరియెంట్ వ్యాప్తిని అడ్డుకోగలమని, అందుకు తగిన చర్యలు తీసుకున్నామని విజయన్ చెప్పారు.