Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నది. కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. మరణాలు నాలుగు లక్షలకు చేరువయ్యాయి. వరుసగా రెండోరోజు కూడా పెరిగాయి. మరణాలు కూడా మరోసారి 1,000 మార్కును దాటాయి. తాజాగా 19,21,450 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 48,786 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోలిస్తే 6శాతం పెరుగుదల కనిపించింది. 24 గంటల వ్యవధిలో 1,005 మంది ప్రాణాలు కోల్పోయారు. ముందురోజు మరణాల సంఖ్య 817గా ఉంది. ఇప్పటివరకు 3,04,11,634 మంది కరోనా సోకగా.. 3,99,459 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల రేటు 1.31 శాతంగా ఉంది.
ప్రస్తుతం 5,23,257 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా.. క్రియాశీల రేటు 1.77 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 96.92 శాతానికి పెరిగింది. గడిచిన 24 గంటల్లో 61,588 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 2.94 కోట్ల మార్కును దాటాయి. మరోపక్క గడిచిన 24 గంటల్లో 27,60,345 మందికి టీకాలు అందించారు. ఇప్పటి వరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 33,57,16,019 కి చేరింది.