Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఇకపై జీఆర్ఈ, టోఫెల్ పరీక్షలు రాసే భారతీయ విద్యార్థులకు ఐడీ ప్రూఫ్‌గా ఆధార్‌కార్డును వినియోగించుకునేందుకు ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) అవకాశం కల్పించింది. అయితే ఇది తాత్కాలికమని, జులై 1 నుంచి తదుపరి నోటీసులు ఇచ్చే వరకు మాత్రమే అమల్లో ఉంటుందని ఈటీఎస్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్-19 నేపథ్యంలో విధిస్తున్న లాక్డౌన్లు, ఇతర ఆంక్షల కారణంగా అనేక మంది విద్యార్థులు పాస్‌పోర్టులు పొందడంలో ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందేందుకు ఈటీఎస్ ఈ గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్స్(జిఆర్ఈ), టెస్ట్ ఆఫ్ ఇంగ్లీస్ యాస్ ఎ ఫారిన్ లాంగ్వేజ్(టోఫెల్) అనే ప్రామాణిక పరీక్షలను నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు ఈ పరీక్షలు రాసేందుకు పాస్‌పోర్టును మాత్రమే ఐడి ప్రూఫ్‌గా పరిగణించే వారు. అయితే దేశంలోని అనేక నగరాల్లో ఆంక్షల కారణంగా విద్యార్థులు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని, పాస్‌పోర్టులు ఉన్నవారు రెన్యువల్ కూడా చేసుకోలేకపోయారని ఈటీఎస్ అధికారి నికోసియా పేర్కొన్నారు.