Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్‌కు రవిశంకర్ ప్రసాద్ సూచన
న్యూఢిల్లీ : ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్‌పై కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మరోమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా కాపీరైట్ చట్టాలతో తన ఖాతాను ట్విట్టర్ ..భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నందున ఇక్కడి చట్టాలను కూడా ఆ సంస్థ అనుసరించి నడుచుకోవాల్సివుంటుందని చెప్పారు. బుధవారం ఇండియా గ్లోబల్ ఫోరం సదస్సులో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా డిజిటల్ కాపీరైట్ చట్టాల కింద నాలుగు ఏళ్ల క్రితం వచ్చిన ఫిర్యాదు ఆధారంగా తన ఖాతాను ఒక గంట పాటు ట్విట్టర్ నిలిపివేసిందని చెప్పారు. 'తప్పుడు సమాచారం, ఫేక్ న్యూస్ ప్రజాస్వామ్యానికి సవాళ్లు. అయితే సెన్సారింగ్ చేయాలన్నది నా ఆలోచన కాదు. అయితే ఇలాంటి భారీ టెక్ కంపెనీలు వ్యాపారాలు చేసుకుంటే చేసుకోవచ్చు కానీ జవాబుదారీతనంగా ఉండాలి' . అని ఆయన అన్నారు.