Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ టెక్స్టైల్ కంపెనీ టిసిఎన్ఎస్ క్లాతింగ్ కో లిమిటెడ్ తమ ఎథ్నిక్ వేర్ బ్రాండ్ ఔరెలియా కోసం బాలీవుడ్ నటి అలియా భట్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అలియాతో ఒప్పందం చేసుకోవడమనేది భావాన్ని ప్రతిధ్వనించే దిశగా చేసిన వ్యూహాత్మక నిర్ణయమని ఆ సంస్థ ఎండి అనంత్ కుమార్ దాగా పేర్కొన్నారు. తమ బ్రాండ్ ఉత్పత్తులు ఆన్‌లైన్‌తో పాటుగా ఆఫ్‌లైన్‌లో కూడా 220కు పైగా ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ ఔట్లెట్లు సహా ఇండియా, శ్రీలంక, నేపాల్, మారిషస్‌లలోని 150కు పైగా నగరాల్లో 1000 పైగా భారీ ఫార్మాట్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయన్నారు.