Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిలిండర్‌పై రూ. 25 పెంపు
- 19 కేజీల ఎల్పీజీపై రూ. 76 బాదుడు
- నిన్న చమురుధరలు.. ఇపుడు గ్యాస్ ధరలు
- ఎడాపెడా భారాలతో జనం బేంబేలు..
న్యూఢిల్లీ : దేశంలో పెరిగిపోతున్న ఇంధన ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న చమురు ధరలు ఇప్పటికే వాహనదారులు, సాధారణ ప్రజలకు ఊపిరిసల్పనీయకుండా చేస్తున్నాయి. నిత్యవసరాల ధరలు ఆకాశాన్నంటి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పుడు వంటగ్యాస్ సిలిండర్లపై కూడా కేంద్రం బాదుడు మొదలు పెట్టింది. దీంతో ఎల్పీజీ సిలిండర్ల ధరలు గురువారం పెరిగాయి.దీంతో మోడీ సర్కార్‌పై మహిళాలోకం గుర్రుమంటున్నది.
ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచిన ధరల ప్రకారం.. ఇంటి అవసరాలకు ఉపయోగించే 14.2 కేజీల బరువు గల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 25.50 లు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో దీని ధర రూ. 834.50కు ఎగ బాకింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఎల్పీజీ గ్యాస్ ధర రూ. 834.50కు, కోల్‌కతాలో రూ. 861కు పెరిగింది. ఇక చెన్నైలో దీని ధర రూ. 850.50కు చేరింది.మరోపక్క, 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 76 రూపాయలు పెంచుతూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ. 1550కు ఎగబాకింది. ఇక హైదరాబాద్‌లో వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 887కు చేరింది. ఇక వాణిజ్య సిలిండర్ ధర రూ. 1768కి ఎగబాకింది. కాగా, గత ఆరు నెలల్లో వంటగ్యాస్ సిలిండర్ ధర రూ. 140 పెరగడం గమనించాల్సిన అంశం. అయితే, ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపుపై దేశవ్యాప్తంగా ఇటు సాధారణ గృహిణులు, అటు హౌటళ్ల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలను అదుపు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కరోనా కష్టకాలంలో ఈ విధంగా ధరల పెంపు సరికాదని ఆందోళన వ్యక్తం చేశారు.