Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అమెజాన్ రెండు కొత్త ఇకో షో పరికరాలను ఆవిష్కరించినట్టు ప్రకటించింది. సరికొత్త ఎకో షో 10. ఎకో షో5ను విడుదల చేసినట్టు పేర్కొంది. వీటి ధరలను వరుసగా రూ.24,999గా, రూ.8,999గా నిర్ణయించింది. ఎకో షో 10ను 10.1 హెచ్డి డిస్ప్లే, 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, ప్రీమియం సౌండు, ఇంటెలిజెంట్ మోషన్ ఫీచర్లను కలిగి ఉందని తెలిపింది. అలెక్సాతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వినియోగదారుడు గదిలో ఎటుతిరిగితే అటు డిస్ప్లే తిరుగుతుంది. ఎకో షో 5ను 5.5 అంగుళాల డిస్ప్లేతో ఆవిష్కరించింది. అవసరాన్ని బట్టి పాన్, జూమ్ అవుతుంది. దానికితోడు ''అలెక్సా, కాల్ మై ఫ్యామిలీ'' అంటే గ్రూప్ కాలింగ్ ఫీచర్తో 8 మందితో ఒకే సారి మాట్లాడొచ్చని ఆ సంస్థ పేర్కొంది.