Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాచారమిస్తే రూ.10 కోట్ల రివార్డ్ :సెబీ వెల్లడి
ముంబయి : స్టాక్ మార్కెట్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలు వెల్లడించే వారికి ప్రస్తుతం ఇస్తున్న బహుమతిని పది రెట్లు పెంచుతూ మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ రివార్డ్ రూ.1 కోటిగా ఉండగా.. ఇకపై దీనిని రూ.10 కోట్లకు పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. స్వతంత్ర డైరెక్టర్లకు సంబంధించిన నిబంధనలకు సవరణలతో సహా గుర్తింపు పొందిన ఇన్వెస్టర్లకు కొత్త నిబంధనావళిని పరిచయం చేసే చర్యలకు సెబీ ఆమోదం తెలిపింది. రెసిడెంట్ ఇండియన్ ఫండ్ మేనేజర్స్ విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లలో భాగంగా ఉండేందుకు వీలు కల్పించింది.