Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: చైనా కమ్యూనిస్టు పార్టీ పుట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ పంపారు. 100 సంవత్సరాల చైనా చరిత్రను పరిశీలిస్తే తన విధానాలను ఎట్లా రూపొందించుకున్నదో అర్థం అవుతుందనీ, తన తప్పుల నుంచి నేర్చుకుంటూ ఎలా ముందుకు సాగుతున్నదో ఒక నిదర్శనంగా ఉన్నదని తెలిపారు. మార్క్సిజం-లెనినిం ఒక సృజనాత్మక శాస్త్రం అని పిడివాదం కాదనీ, కొన్ని సూత్రాలు వల్లెవేసేది అసలే కాదని గుర్తు చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టడంలో చైనా చూపిన చొరవ, కృషిని ఏచూరి అభినందించారు. ప్రపంచం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి పోతున్న సమయంలో మహమ్మారి వచ్చిందనీ, అయినా దానిని తట్టుకుని చైనా నిలబడిందని ఆయన లేఖలో పేర్కొన్నారు.