Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్ ప్రకారం.. మార్చి 2020 నాటికి వాణిజ్య బ్యాంకుల్లో పేరుకుపోయిన మొత్తం ఎన్పీఏల్లో 77.9 శాతం పారిశ్రామిక వర్గాలు, ఇతర భారీ రుణ ఖాతాలవే. ఈ బడా వర్గానికి బ్యాంకులు ఇచ్చిన రుణాల వాటా 52.7 శాతంతో పోలిస్తే. మొండిబకాయిల నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంది. పారిశ్రామిక రుణాల్లో 11.3 శాతం, వ్యవసాయ రుణాల్లో 9.8 శాతం, సేవారంగం రుణాల్లో 7.5 శాతం, వ్యక్తిగత రుణాల్లో 2.1 శాతం మొండిబకాయిలుగా మారాయి. పెద్ద రుణగ్రహీతలకు ఇచ్చిన మొత్తం అప్పుల్లో టాప్-100లో ఉన్న వారు 34.3 శాతం రుణాలు పొందారు. మొత్తం బ్యాంకులు ఇచ్చిన అప్పుల్లో ఈ వంద మందికి 18.1 శాతం రుణాలు అందాయి. రాని బాకీల విషయంలోనూ ఈ 100 మంది వాటా పెద్ద రుణగ్రహీతల్లో 11 శాతంగా.. మొత్తం బకాయిల్లో 8.6 శాతం మేర ఉన్నాయంటే ఈ వర్గాలకు బ్యాంక్లు, ఆర్థిక విధానాలు ఏ స్థాయిలో మద్దతునిస్తున్నాయే స్పష్టం అవుతోంది.