Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు పెంపు
- చెన్నైలో సెంచరీ దాటి పరుగులు
న్యూఢిల్లీ : దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు ప్రజలను షాక్‌కు గురి చేస్తున్నాయి. రెండు రోజుల విరామమనంతరం పెట్రోల్ ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు పెరగగా, డీజీల్ ధరలు యథాతథంగానే ఉన్నాయి. జులై నెలలో ఈ పెరుగుదల మొదటిది కావడం గమనార్హం. తాజా పెంపుతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలోని పట్టణాల్లో పెట్రోల్ ధరలు వాహనదారులకు షాకిస్తున్నాయి. సెంచరీ మార్కును దాటిన పెట్రోల్ ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఇప్పుడు సెంచరీ మార్కు దాటిన నగరాల జాబితాల్లో చెన్నై కూడా చేరింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థల నిర్దేశించిన ధరల ప్రకారం.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.16గా, డీజీల్ ధర రూ. 89.18గా ఉన్నది. వాణిజ్య రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.24గా, డీజీల్ ధర రూ. 96.72గా నమోదైంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 99.04కు ఎగబాకగా, డీజీల్ ధర రూ. 92.03గా నమోదైంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.48కి పెరిగింది. డీజీల్ ధర రూ. 94.54 గా ఉన్నది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.13కి చేరింది. డీజీల్ ధర రూ. 93.72గా పలుకుతున్నది. ఇక హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 103.05కు ఎగబాకి చుక్కలు చూపిస్తున్నది. డీజీల్ ధర రూ. 97.20గా రికార్డయ్యింది. ఎలాంటి నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఇంధన ధరలను కట్టడి చేయడంలో విఫలమవుతున్న మోడీ సర్కారు తీరుపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.