Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా మరణాల్లో భారత్ మూడో స్థానం
- యూఎస్‌లో అత్యధికంగా ఆరు లక్షలు..
- బ్రెజిల్లో ఐదు లక్షల మరణాలు
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మరణాలు ఆందోళనను కలిగిస్తున్నాయి. భారత్‌లో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య నాలుగు లక్షలకు పైగా నమోదైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణాల్లో భారత్ మూడో స్థానానికి చేరింది. యూఎస్, బ్రెజిల్ దేశాల తర్వాత భారత్‌లోనే కరోనా మరణాలు అధికంగా ఉండటం గమనార్హం.అధికారిక లెక్కల ప్రకారం.. భారత్‌లో కరోనా మరణాలు గత 24 గంటల్లో 853గా రికార్డయ్యి 4,00,312కు పెరిగాయి. ఇక యూఎస్‌లో అత్యధికంగా 6.05 లక్షల కరోనా మరణాలు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో ఉన్న బ్రెజిల్లో 5.2 లక్షల మందికి పైగా మహమ్మారి కారణంగా మృతి చెందారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. భారత్‌లో గత 24 గంటల్లో 46,617 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 59,384 మంది రోగులు కోలుకున్నారు. ఇక అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర (9,195 కేసులు), తమిళనాడు (4,481 కేసులు), ఆంధ్రప్రదేశ్ (3,841 కేసులు), కర్నాటక (3,203 కేసులు) లు ఉన్నాయి. ఇక భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.04 కోట్లకు పైగా చేరుకున్నది. గత 24 గంటల్లో అత్యధిక మరణాలు మహారాష్ట్ర (252 మంది)లో చోటు చేసుకున్నాయి. అలాగే, 2.95 కోట్ల మందికి పైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో రికవరీ రేటు 96.75 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 13,620కు తగ్గింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,09,637గా ఉన్నది. అలాగే, గత 24 గంటల్లో దేశంలో 42.64 లక్షల డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. దీంతో ఇప్పటి వరకు అందించిన మొత్తం వ్యాక్సిన్ డోసుల సంఖ్య 34 కోట్లకు పైగా చేరింది.