Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : హవాలా మనీ దోపిడీతో సంబంధమున్న కేసులో వచ్చే వారం కేరళ బిజెపి చీఫ్ కె. సురేంద్రన్ను రాష్ట్ర పోలీసులు ప్రశ్నించ నున్నారు. ఈ మేరకు ఆయనకు సమన్లు జారీ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో జులై 6న విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారని సమాచారం. ఏప్రిల్ 6 అసెంబ్లీ ఎన్నికల ముందు ఓ దోపిడీ జరగ్గా....ఎర్నాకులం-త్రిసూర్ హైవేఐ ఓ గ్యాంగ్ తన వద్ద నుండి రూ. 25లక్షలు దోచుకెళ్లారని ఎన్నికలు జరిగిన తర్వాత ఓ వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఆ డబ్బు 3.5 రూపాయల హవాలా మనీలో భాగమని పోలీ సులు గుర్తించారు. ఆ డబ్బును బిజెపికి అందిం చేందుకు తీసుకెళుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ ఆరోపణలను బిజెపి తోసిపుచ్చింది. బిజెపికి దీనితో ఎటువంటి సంబంధం లేదని 100 శాతం నమ్మాకే...పోలీసుల దర్యాప్తుకు అంగీకరించామని, దేనికైనా సహకరిస్తామని గత నెలలో సురేంద్రన్ అన్నారు. కాగా, ఆయన ఎన్నికల్లో బ్లాక్ మనీ వినియోగించారని అధికార వామపక్ష పార్టీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శించాయి. ఈ కేసులో సురేంద్రన్‌తో పాటు ఇతర బిజెపి నేతలను కూడా పోలీసులు విచారించనున్నారు. ఎన్నికల సమయంలో ప్రత్యర్ధిని నామినేషన్‌ను ఉపసంహరిం చుకోవాలంటూ అతడికి లంచం ఇచ్చినందుకు సురేంద్రన్‌పై తొలి కేసు నమోదైంది. అదేవిధంగా ఎన్డిఎలోకి తిరిగి రావాలంటూ జనాధిపత్య రాష్ట్రీయ సభ (జెఆర్‌ఎస్) నేత సికె జానుకు రూ. 10 లక్షలు ఇచ్చినట్లు అరోపణలున్నాయి.