Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ :ఉత్తరాఖండ్ నూతన సీఎంగా తీరత్‌సింగ్ రావత్ స్థానంలో పుష్కర్ సింగ్ ధమీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ శాసనసభపక్ష నేతలు పార్టీ హెడ్‌క్వార్టర్స్‌లో సమావేశం అనంతరం ఆయన పేరును వెల్లడించారు.పుష్కర్ సింగ్ ధమీతో పాటు కొత్త క్యాబినేట్ నేడు (ఆదివారం) ప్రమాణస్వీకారం చేయ నున్నది. కుమౌన్ ప్రాంతంలోని ఖతిమా నియోజకవర్గం నుంచి పుష్కర్‌సింగ్ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న సీఎంల మార్పు, రాజకీయ సమీకరణాలు చర్చనీయాంశంగా మారాయి.
పదవీ చేపట్టిన నాలుగు నెలలకే తీరత్ సింగ్ రిజైన్
ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాలుగు నెలలకే ఆయన బాధ్యతల నుంచి వైదొలగడం గమనార్హం.