Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎస్కేఎం నేతలు
న్యూఢిల్లీ : మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలపై ఎన్సీపీ నేత శరద్ పవార్ విరుద్ధమైన ప్రకటనల నేపథ్యంలో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఎస్కేఎం నేతలు డిమాండ్ చేశారు. చట్టాల నుంచి లబ్ది పొందే కార్పొరేట్లు, కేంద్ర ప్రభుత్వాల ఒత్తిడికి లోనుకావొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, డాక్టర్ దర్శన్ పాల్, గుర్నమ్ సింగ్ చారుని, హన్నన్ మొల్లా, జగ్జిత్ సింగ్ దల్లెవాల్, జోగిందర్ సింగ్ ఉగ్రహాన్, శివకుమార్ శర్మ 'కక్కాజీ', యుధ్వీర్ సింగ్, యోగేంద్ర యాదవ్ శనివారం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు.