Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్ముందు పోరు కొనసాగిస్తా: అఖిల్ గొగోరు
గువహతి: చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) దుర్వినియోగం అవుతున్నదనడానికి తన కేసు నిదర్శనమని రైతు హక్కుల కార్యకర్త, అసోం ఎమ్మెల్యే అఖిల్ గొగోరు అన్నారు. తనను జైల్లో ఉంచడానికి ప్రయోగించిన 'ఉపా' చట్టంపై మున్ముందు తన పోరు కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇటీవల తాను జైల్లో ఉన్నా తనను గెలిపించిన శివసాగర్ నియోజకవర్గ ప్రజలక ధన్యవాదాలు తెలుపుతూ.. వారికి అండగా ఉంటానని చెప్పారు. త్వరలోనే తన నియోజకవర్గం అంతటా పర్యటిస్తానని పేర్కొంటూ.. ప్రభుత్వంపై పలు విమర్శనాస్త్రాలు సంధించారు. కాగా, 2019 డిసెంబర్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో గొగోరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై అరెస్టయ్యారు. అస్సాంలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు కారణం గొగోరు అంటూ.. పోలీసులు ఉపా కింద రెండు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ అతడిపై నమోదైన అభియోగాలను ఎన్ఐఏ కోర్టు తోసిపుచ్చింది. దీంతో దాదాపు 19 నెలల తర్వాత జైలు నుంచి ఆయన విడుదలయ్యాయి. ఈ సందర్భంగానే ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.అలాగే, తనను జైల్లో ఉంచాలన్న ప్రయత్నాలు బెడిసికొట్టాయనీ, చివరకు న్యాయమే గెలిచిందన్నారు.