Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రక్షణ సంస్థలను ప్రయివేటీకరణ చేయవద్దు
- రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీపీఐ(ఎం) ఎంపీ ఎలమారం కరీమ్ లేఖ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసకువచ్చిన నూతన రక్షణ సేవల ఆర్డినెన్స్‌ను (ది ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీస్ ఆర్డినెన్స్-2021) వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీపీఐ(ఎం) సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యులు ఎలమారం కరీమ్ లేఖ రాశారు. ఇది అప్రజాస్వామిక, రాజ్యంగ వ్యతిరేకమైనదని ఆరోపించారు. రక్షణ సంబంధిత నిత్యావసర సేవల్లో పాల్గొన్న సిబ్బంది సమ్మెకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ చర్యలకు దిగిందన్నారు. తాజా ఆర్డినెన్స్ సమ్మెను, రక్షణకు సంబంధించిన అవసరమైన సేవల్లో పాల్గొన్న సిబ్బంది నిరసనను నిషేధిస్తుంది. వారంట్ లేకుండానే ఎవరినైనా అరెస్టు చేసే అధికారాన్ని ఈ కల్పిస్తుంది. ఎలాంటి ఎక్వైరీలు లేకుండా అరెస్టులకు అనుమతిస్తుంది. రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడంతో పాటు 15 వేల జరిమానా విధించే అవకాశం ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల రక్షణ రంగ సేవలు అందిస్తున్న ఉద్యోగులపై ప్రభావం పడుతుందన్నారు.''ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ ఆర్డినెన్స్ అప్రజాస్వామికమైనది. రాజ్యాంగానికి విరుద్ధమైనది. దీనిపై పునరాలోచించి.. దీనిని ఉపసంహరించుకోవాలని కోరుతున్నాను'' అని ఎంపీ ఎలమారం కరీమ్ లేఖలో పేర్కొన్నారు. అలాగే, రక్షణ రంగ పరిధిలో కొనసాగుతున్న కార్మికుల డిమాండ్లను అంగీకరించాలనీ, రక్షణ రంగ ఫ్యాక్టరీల ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పేర్కొన్నారు.