Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు శాతం పడిపోయిన వైనం : ప్రభుత్వ నివేదిక
న్యూఢిల్లీ : ప్రముఖ శాస్త్రీయ పరిశోధనలలో మహిళల పాత్ర తగ్గిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈ తగ్గుదల మూడు శాతంగా ఉండటం గమనార్హం. ప్రభుత్వ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. డైరెక్టరీ ఆఫ్ ఎక్స్ట్రామ్యూరల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) ప్రాజెక్ట్ 2018-19 నివేదిక ప్రకారం.. ఎక్స్ట్రామ్యూరల్ రీసెర్చ్ (ఈఎంఆర్) మద్దతు అందుకున్న పరిశోధనలో మహిళా ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్స్ (పీఐలు) పాల్గొనడం 2018-19లో 28 శాతంగా, 2017-18లో 31 శాతంగా ఉన్నది. మొత్తం 4,626 ప్రాజెక్టులలో పురుషులు పీఐలుగా 72 శాతం మంది 74 శాతం ప్రాజెక్టులలో భాగమయ్యారు. అయితే, కేవలం 26 శాతం ప్రాజెక్టులో మాత్రమే మహిళలు పాలుపంచుకున్నారు. కో-ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్స్ (కో-పీఐ)లలో 83 శాతం మంది పురుషులు, 17 శాతం మంది మహిళలు ఉన్నారు.