Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రముఖ టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కొత్తగా 'ఆల్-ఇన్-వన్' ప్యాక్‌ను ఆవిష్క రించింది. దీంతో వినియోగదారులు మొబైల్, ఫైబర్, డిటిహెచ్ సర్వీసులను అందుకోవచ్చు. 'ఎయిర్టెల్ బ్లాక్' పేరుతో పరిచయమైన ఈ ఆఫర్లో నెలకు రూ.998 ధర కలిగిన ప్యాక్‌లో 2 మొబైల్ కనెక్షన్లు, ఒక డిటిహెచ్ కనెక్షన్ పొందవచ్చని భారతీ ఎయిర్టెల్ తెలిపింది. మరో ప్లాన్ రూ.2,099 ప్యాక్‌లో 3 మొబైల్ కనెక్షన్లు, ఒక ఫైబర్ కనెక్షన్, ఒక డిటిహెచ్ కనెక్షన్ పొందవచ్చు.