Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వినియోగదారుల ఫోన్లోని డేటా పూర్తిగా అయిపోయినా అత్యవసరంగా డేటాను వాడుకునేందుకు రిలయన్స్ జియో ఓ కొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. డేటాను తొలుత వాడుకుని తర్వాత చెల్లించేలా ఐదు డేటా లోన్ ప్లాన్లను ఆవిష్కరించింది. రూ.11 ఒక్కో ప్యాక్‌తో ఒక జిబి హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఈ విధానంలో తొలుత డేటాను ఉపయోగించుకుని దానికయ్యే మొత్తాన్ని ఆ తర్వాత చెల్లించొచ్చు. ప్రస్తుత డేటా ప్యాక్ అయిపోయిన తర్వాత మరో డేటా టాప్‌ను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు డేటా లోన్ ఉపయోగపడనుంది.