Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెరిచేందుకు అనుమతి
ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ 6.0లో భాగంగా ఈ నెల 5 నుంచి స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు తెరిచేందుకు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. కరోనా బీభత్సం తగ్గడంతో ఆరు వారాల లాక్డౌన్ అనంతరం అన్‌లాక్ ప్రక్రియను ప్రభుత్వం మొదలు పెట్టింది. ఆరో దశ ప్రక్రియలో భాగంగా పలు వాణిజ్యపరమైన కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. స్పాస్, సినిమా, థియేటర్లు, మల్లిపెక్స్లు, స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతినివ్వలేదు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ధియేటర్లు, మల్లిఫెక్స్లు, బ్యాంకెట్ హాల్స్, సామాజిక, రాజకీయ కార్యకలాపాలు, ఆడిటోరియమ్స్, సిమ్మింగ్పూల్స్, పాఠశాలు, కాలేజీలు, స్పా, అమ్యూజ్మ్ెం పార్కులకు తెరవవద్దని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది. గత వారం 50 శాతం మంది కెపాసిటీతో యోగా సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది.