Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణం
- హర్ష గోయింకా ట్వీట్‌కు విజయన్ స్పందన
తిరువనంతపురం : దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో కేరళ ఒకటని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. సిర్థమైన, ఆవిష్కరణ పరిశ్రమలు అభివృద్ధి చెందడానికి కేరళ అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని విజయన్ హామీ ఇచ్చారు. కేరళలో తమ సంస్థ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతును ప్రశంసిస్తూ, కృతజ్ఞతలు తెలుపుతూ ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష గోయింకా చేసిన ట్వీట్‌కు ప్రతిస్పం దనగా విజయన్ ఈ విషయాన్ని తెలిపారు. 'కేరళలో మాకు అత్యధిక మంది ఉద్యోగులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా స్ఫూర్తిదాయకమని మేం కనుగొన్నాం' అని ఆర్పిజి ఎంటైర్ప్రైజస్ చైర్మన్ గోయింకా ట్వీట్ చేశారు. దీనిపై స్పందిస్తూ 'కేరళలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై ఆందోళనలను తొలగించినందుకు ధన్యవాదాలు. మీ నిజాయితీ ప్రశంస ించగదగ్గది. దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉండే రాష్ట్రాల్లో కేరళ ఒకటి. దీని మేం కొనసాగిస్తాం. సిర్థమైన, ఆవిష్కరణ పరిశ్రమలు ఇక్కడ అభివృద్ధి చెందడానికి ఎల్డిఎఫ్ ప్రభుత్వం హామీగా ఉంటుంది' అని విజయన్ పేర్కొన్నారు. కాగా, కైటెక్స్ అనే సంస్థ కేరళ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన సమయంలో గోయింకా ఈ విధంగా విజయన్ ప్రభుత్వాన్ని సమర్థించడం అందరిదృష్టిని ఆకర్షిస్తోంది. 'సిపిఎం నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కనికరంలేని వేధింపులకు గురిచే స్తోంది' అని కైటెక్స్ గార్మెంట్స్ సంస్థ ఆరోపించింది. ఈ వేధింపులతో రాష్ట్రం నుంచి రూ. 3,500 కోట్ల పెట్టుబడి ప్రాజెక్టును ఉపసం హరించుకుంటున్నట్లు కూడా కైటెక్స్ ప్రకటించింది.కైటెక్స్ సంస్థతో సమస్యను పరిష్కరించడానికి సానుకూల చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల మంత్రి పి రాజీవ్ శనివారం ప్రకటించారు.