Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 మంత్రుల ప్రమాణ స్వీకారం..
- ఐదేండ్లలో మూడో ముఖ్యమంత్రి..
డెహ్రడూన్ : ఉత్తరాఖండ్ నూతన సీఎంగా పుష్కర్ సింగ్ ధామి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు నాలుగు నెలల వ్యవధిలో రాష్ట్రానికి ఆయన మూడో ముఖ్యమంత్రి. మొత్తంగా 2000 నవంబర్‌లో ఏర్పడిన ఉత్తరాఖండ్‌కు 11వ ముఖ్యమంత్రిగా ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బేబీ రాణీ మౌర్య ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో సత్పాల్ మహరాజ్, హరక్ సింగ్ రావత్, బంషిదర్ భగత్, యశ్పాల్ ఆర్యా, బిషెన్ సింగ్ చుఫల్, సుభోద్ ఉనియాల్, అరవింద్ పాండే, గణేష్ జోషి, ధన్ సింగ్ రావత్, రేఖా ఆర్య, యతేష్వారానంద్ ఉన్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీకి మరో తొమ్మిది నెలలు గడువు మాత్రమే ఉన్నది. 2017 ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఇప్పటి వరకూ ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చింది.