Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గత లనెలలో ప్రకటించిన ఇ- కామర్స్ నూతన నిబంధనల పట్ల ఆన్లైన్ రిటైల్ సంస్థలు అమెజాన్, టాటా ప్రతినిధులు.. కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిసి తమ ఆందోళనను తెలియజేశాయి. ఈ నిబంధనల పట్ల ఆందోళన చెందుతున్నామని, తమ అభిప్రాయాలను ఈ నెల 6లోగా చెప్పాలని విధించిన గడువును పొడిగించాలని శనివారం జరిగిన సమావేశంలో ఈ కామర్స్ సంస్థల ప్రతినిధులు.. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖను కోరినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఫ్లాష్ సేల్స్‌పై ఆంక్షలు, సంబంధిత పార్టీల నిర్వచనం, ఇకామర్స్ మేజర్లకు నిబంధనలను పాటించడం వంటి ముఖ్యమైన అంశాలను లేవనెత్తారని తెలుస్తోంది. ఈ నిబంధనలపై ప్రభుత్వ అధికారులు రాతపూర్వక సమాధానాలు కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
జూన్ 21న నూతన ఇ-కామర్స్ నిబంధనలను కేంద్రం తీసుకొచ్చింది. ఫ్లాష్ సేల్స్‌ను పరిమితం చేయడమే కాకుండా, తప్పుదోవ పట్టిస్తున్న ప్రకటనలను నిలిపివేయడం, ఫిర్యాదుల వ్యవస్థను తప్పనిసరి చేయడం వంటివి ఉన్నాయి. అమెజాన్, ఫ్లిఫ్‌కార్ట్ వంటి ఇ కామర్స్ సంస్థలు తమ వ్యాపార కార్యకలాపాలను సమీక్షించాల్సి ఉంటుంది. స్వదేశీ సంస్థలు జియో మార్ట్, బిగ్ బాస్కెట్, స్నాప్ డీల్ వంటి సంస్థలకు లాభం చేకూరే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. కోవిడ్-19తో వ్యాపారాలు చితికిపోయాయని, ఈ నూతన నిబంధనలు తమ అమ్మకం దారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అమెజాన్ తెలిపింది. ప్రతిపాదిత నిబంధనలు సమస్యాత్మకంగా ఉన్నాయని టాటా ప్రతినిధి పేర్కొన్నారు.