Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారిపై ముందుడి పోరాడుతున్న వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది అందరికీ సంయుక్తంగా ఈ ఏడాది భారతరత్న అవార్డును ప్రకటించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కోరారు. దేశంలోనే అత్యుత్తమ అవార్డుగా ఉన్న భారతరత్నను ప్రకటించడం ద్వారా కరోనాపై పోరులో ప్రాణాలు కోల్పోయిన వైద్యులకు ఘనమైన నివాళులర్పించినట్లు అవుతుందని ఆదివారం ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా కాలంలో నిర్విరా మంగా సేవలను అందిస్తున్నారని తెలిపారు. రెండో దశ కరోనా పోరులో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 730 మంది వైద్యులు మరణించారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) గతనెలలో తెలిపింది. బీహార్లో అత్యధికంగా 115 మంది డాక్టర్లు చనిపోగా, ఢిల్లీలో 109, యుపిలో 79, పశ్చిమబెంగాల్లో 62, రాజస్థాన్లో 43, జార్ఖండ్లో 39, ఆంధ్రప్రదేశ్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మొదటి దశలో 748 మంది వైద్యులు మరణించారని ఐఎంఎ పేర్కొంది.