Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోవిడ్ తగిన ప్రవర్తనను పాటించకపోతే ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లలో థర్డ్ వేవ్ గరిష్టస్థాయికి చేరుకుంటుందని ప్రభుత్వ ప్యానెల్ శాస్త్రవేత్త మనీంద్ర అగర్వాల్ తెలిపారు. అయితే, సెకండ్‌వేవ్ సమయంలో నమోదైన రోజువారీ కేసులలో సగం సంఖ్యను ఇది చూసే అవకాశం ఉన్నదని చెప్పారు. సార్స్-కోవ్-2 ( ూA=ూ-జశీV-2) యొక్క కొత్త వైరస్ వేరియంట్ ఉద్భవిం చినట్టయితే థర్డ్ వేవ్ సమయంలో ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుందని శాస్త్రవేత్త తెలిపారు. గణిత నమూనాలను ఉపయోగించి కరోనా వైరస్ కేసుల పెరుగుదలను అంచనా వేయడానికి గతేడాది సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్లో ఆయన సభ్యుడిగా ఉన్నారు. ఐఐటీ-కాన్పూర్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న అగర్వాల్‌తో పాటు ఐఐటీ-హైదరాబాద్ మరో శాస్త్రవేత్త ఎం. విద్యాసాగర్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ డిప్యూటీ చీఫ్ (మెడికల్) లెఫ్టినెంట్ జనరల్ మాధురి కనిత్కర్ కూడా సభ్యులుగా ఉన్నారు.