Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గ్రూపు రాజకీయాలు, అసంతృప్త రాగాలతో బీజేపీలో అంతర్గతంగా కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలతో పాటు కేంద్ర నాయకత్వం లోనూ ఇదే తీరు కొనసాగుతున్నది. అయితే, బీజేపీ మాత్రం తమ పార్టీలో అలాంటి సమస్యలు లేవనీ, అంతా సవ్యంగానే ఉన్నదని లోపాలను కప్పి పుచుకునే ప్రయత్నం చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. త్రిపుర నుంచి యూపీ వరకు, మధ్యప్రదేశ్ నుంచి కేరళ వరకు.. ఇలా ఏ రాష్ట్రం చూసినా అక్కడ ఆపార్టీ పరిస్థితులు ఇలాగే ఉన్నాయన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో సాక్షాత్తూ ముఖ్య మంత్రుల పైనే ఆ పార్టీ నాయకులు అసంతృప్త రాగాలు, తిరుగు బాటుబావుటా ఎగరేస్తున్న సందర్భాలను వారు ఉదహరించారు. ఇందుకు ఉత్తరా ఖండ్‌లో ఇటీవల చోటు చేసుకున్న సీఎం మార్పే ఇందుకు నిదర్శనమని ఉటంకిం చారు. కరోనా కారణంగా ఉప ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు కనబడటం లేదనీ, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడకుండా నిరోధించడంలో భాగంగానే ఉత్తరా ఖండ్‌లో సీఎం తీరత్ సింగ్ మార్పు అని వార్తలు వినిపించినప్పటికీ అదంతా కేవలం ఒక సాకు మాత్రమే అని విశ్లేషకులు విశ్లేషించారు. ఆ రాష్ట్ర బీజేపీ విభాగంలో అంతర్గత కుమ్ములాటలే సీఎం మార్పునకు కారణమని వివరించారు.
ఒక్క ఉత్తరాఖండ్‌లో మాత్రమే కాదు.. అనేక రాష్ట్రాలు, కేంద్ర నాయకత్వంలో సైతం ఆ పార్టీకి ఇలాంటి కష్టాలు తప్పడం లేదని చెప్పారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న యూపీ, కర్నాటక, త్రిపుర, మధ్యప్రదేశ్ లతో పాటు ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీకి 'గ్రూపు రాజకీయాల' బెడద తప్పడం లేదని రాజకీయ విశ్లేష కులు తెలిపారు. ముఖ్యంగా, పార్టీ కేంద్ర నాయకత్వం.. రాష్ట్రాల్లో సీఎంల నియామకంపై నియంతృత్వంగా వ్యవ హరిస్తున్నదనీ, తన సొంత ఆలోచనలను రాష్ట్ర రాజకీయాల పై రుద్దుతోందన్న ఆరోపణలను ఆ పార్టీ నాయకులే అంతర్గతంగా మాట్లాడుకుంటున్నట్టు విశ్లేషకులు వివరిం చారు. రాజకీయంగా కీలక రాష్ట్రాలైన మహారాష్ట్రలో మరాఠాయేతరుడైన దేవేంద్ర ఫడ్నవీస్‌ను, హర్యానాలో జాట్ సామాజిక వర్గానికి చెందని మనోహర్ లాల్ కట్టర్‌ను, జార్ఖం డ్లో గిరిజనయేతరుడైన రఘుబర్‌దాస్‌ను సీఎం లుగా నియమించడం వంటివి బీజేపీ కేంద్ర నాయకత్వం వైఖరిని సుస్పష్టంగా తెలియజేస్తున్నదని చెప్పారు. కర్నాటకలో సీఎం యడియూరప్ప మార్పుపై ఊహాగానాలు, అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే అతిపెద్ద రాష్ట్రం యూపీలో సీఎం యోగి పంచా యితీ వంటివి ఆయా రాష్ట్రాల్లో బీజేపీలో గ్రూపు రాజకీ యాలకు బలాన్ని చేకూరుస్తున్నదని విశ్లేషకులు వివరిం చారు. మోడీ-షా ద్వయం బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని తమ చేతుల్లో పెట్టుకొని ఏకపక్ష నిర్ణయాలతో పార్టీలో ఇతర నాయకులను ఎదగనీయడం లేదన్న గుసగుసలు ఆ పార్టీలోనే వినబడుతున్నాయని తెలిపారు. జాతియాధ్యక్షుడి గా ఉన్న జేపీ నడ్డా.. ఇప్పటికీ పార్టీని తన సొంత నిర్ణయా లతో ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారనీ, అమిత్ షా నుంచి ఆదేశాల కోసమే వేచి చూస్తున్నారని బీజేపీ జాతీయ నాయకుడొకరు తెలిపారు.
ఇలాంటి కారణాల వల్లనే ఇటీ వల ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ చేదు ఫలి తాలు వచ్చాయని చెప్పారు. ఇప్పటికైనా పరిస్థితులు మారకపోతే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పునరావృతం కాక తప్పదని ఆ నాయకుడు వాపోవడం గమనార్హం.