Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళా వికలాంగులపై మరింత వివక్ష : మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : సమాజంలో మహిళలు వివక్షకు గురవుతున్నారు, అందునా వికలాంగ మహిళలు తీవ్రస్థాయిలో వివక్షను ఎదుర్కొంటున్నారని మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వితం తుపై లైంగికదాడి కేసు విచారణ సందర్భంగా మధురై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తమిళనాడులోని మధురై ప్రాంతంలో 2013లో వినికిడి సమస్య, మాట్లాడలేని ఒక మూగ మహిళపై ముగ్గురు వ్యక్తులు లైంగికదాడికి యత్నించారు. ఈ కేసులో కింది కోర్టు ముగ్గురు దోషులకు ఏడేండ్లశిక్ష విధించగా, ఈ జైలు శిక్షను సవాల్ చేస్తూ దోషులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం పైవిధంగా వ్యాఖ్యానించింది. నేటి సమాజంలో మహిళలు వివక్షకు ఎదుర్కొంటున్నారని, అందునా వికలాంగ మహిళలు రెండింతలు వివక్షకు గురవుతున్నారని మధురై ధర్మాసనం వ్యాఖ్యానించింది. జస్టిస్ కె.మురళీశంకర్ మాట్లాడుతూ, దోషులకు కఠినమైన శిక్ష వేస్తున్నా..సమాజంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆగటం లేదు. సమాజంలో వారిని చూసే ధోరణి మారటం లేదు..అని ఆయన అన్నారు. వికలాంగ మహిళల పట్ల కొంతమంది ఈ దారుణానికి ఒడిగట్టడం చాలా తీవ్రమైన నేరం. కింది కోర్టు ఇచ్చిన తీర్పును మార్చాలనుకోవటం లేదు..అని ఆయన అన్నారు. ఏడేండ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఆయన కొట్టేశారు.